ఏపీలో చిరుద్యోగుల సమస్యల పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం స్వల్ప వేతనాలు, సేవా రుసుముల మీద బతికేవారిని ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదని ఆయన అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ తరఫున క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు నియమితులయిన ఫెసిలిటేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఈ చిరుద్యోగులపై సానుకూలంగా స్పందించి బకాయిలు ఇచ్చి ఆడుకోవాలని అన్నారు.