telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎడిటర్‌ ఆర్నాబ్ గోస్వామికి 14 రోజుల రిమాండ్..

రిపబ్లిక్‌ టెలివిజన్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామి నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటీరియల్‌ డిజైనర్‌ మరణానికి సంబంధించిన విషయంలో ఆయనను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తన నివాసంపై పోలీసులు దాడి చేయడంతో పాటు తమ మీద తన అత్త, మామ, తన కొడుకు మీద కూడా దాడి చేశారని అర్నాబ్‌ ఆరోపణలు చేశాడు. అయితే…ఈ అరెస్టును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు ఖండించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరో సారి అపహాస్యం చేశాయంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. అర్నబ్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ ఘటనను వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్యం నాలుగవ స్తంభంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. శివసేన ప్రభుత్వం కాంగ్రెస్ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. అయితే.. ఈకేసులో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ అలీబాగ్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండనున్నారు. అర్నాబ్‌ గోస్వామిని పోలీస్‌ కస్టడీకి పంపించాలని కోరగా..జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

Related posts