telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటమి భయంతో రఘునందన్, హరీష్ కాంగ్రెస్ పై విష ప్రచారం

ఉదయమే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే…కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌ లోకి వెళుతున్నాడంటూ పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అడిషినల్ సీఈఓ బుద్ధ ప్రకాష్ ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు కలిశారు.దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పొద్దున 7 గంటల నుండి కాంగ్రెస్ అభ్యర్థి పై ఒక ప్రముఖ ఛానల్ లో వచ్చిన వీడియో లాగా తయారు చేసి పార్టీ మారుతున్నాడు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారని మండిపడ్డారు. వారిని అరెస్టు చేయాలని డీజీపీని అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ని కలిసామని పేర్కొన్నారు. నిన్న టీఆర్‌ఎస్‌ నాయకులను మా అభ్యర్థి కలిసినట్టు ఒక వీడియో తయారు చేశారని పైర్‌ అయ్యారు. ఓటమి భయంతో రఘునందన్ రావు, హరీష్ రావు కలిసి కాంగ్రెస్ పార్టీ పై ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ఒకే సామాజికవర్గంకు చెందిన వారని.. రఘునందన్ trs నుండి వచ్చిన వ్యక్తి అని మండిపడ్డారు. మా అభ్యర్థి ఇమేజ్ డ్యామేజ్ చేసిన వారిని పోలింగ్ పూర్తి అయ్యే లోపు అరెస్టు చేయాలని డీజీపీని కోరామన్నారు. డీజీపీ వీడియో ప్రచారం చేసిన వారిని అరెస్టు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Related posts