telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఒపుకున్న ఇంగ్లాండ్…

టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆడే భార‌తీయ క్రికెట‌ర్లు ఇప్ప‌టికే కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 18 ఏళ్ల దాటిన వారు టీకా తీసుకోవచ్చు అని కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన త‌ర్వాత క్రికెట‌ర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. ముంబైలో రెండు వారం పాటు క్వారెంటైన్‌లో ఉండ‌నున్న భారత క్రికెట‌ర్లు.. ఇంగ్లండ్ వెళ్లిన త‌ర్వాత అక్క‌డ కూడా ప‌ది రోజులు క్వారెంటైన్‌లో ఉంటారు. అయితే భారత్‌లో తొలి డోసు తీసుకున్న కోహ్లీసేనకు.. రెండ‌వ డోసు టీకాల‌ను బ్రిట‌న్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇవ్వ‌నున్న‌ది. బ్రిట‌న్ ఆరోగ్య‌శాఖ ఆధ్వ‌ర్యంలో భారత ఆటగాళ్లు రెండ‌వ డోసు టీకాల‌ను వేయించుకుంటుంద‌ని అధికార వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఇంగ్లండ్ వెళ్లే ఆట‌గాళ్ల‌కు మూడుసార్లు ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు కూడా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. మరోవైపు టీమిండియాకు బ్రిటీష్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. టీమిండియా సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ మంత్రాంగం ఫలించింది.

Related posts