టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని, తాము కేసులకు భయపడబోమని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలకు తాము పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. ఏపీ రాజధానిపై వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని అన్నారు.