telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం

ashwathama reddy

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఆయనను ఇంట్లో నుంచి బయటకు తరలించే క్రమంలో పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మద్య తోపులాట చోటుచేసుకుంది. అశ్వత్థామరెడ్డిని ఆయన నివాసం నుంచి పోలీస్‌ వాహనంలో తరలించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌లోని రెడ్డి కాలనీలో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరి అదుపులోకి తీసుకున్నారు.

Related posts