telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ జట్టును కూడా వదలని గాయాలు..

ఆసీస్ పర్యటనలో ఇప్పటికే టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. అటు ఆసీస్‌లోనూ గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్‌ యువ ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ గాయపడ్డాడు. విల్‌ పకోవ్‌స్కీ..టెక్నిక్‌గా చూస్తే మంచి ప్రతిభావంతుడు. ఐతే…చిన్నప్పటి నుంచి గాయాలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 64, 8 పరుగులు చేశాడు. అయితే సిడ్నీ టెస్టులో ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్‌ సమయంలో పకోవ్‌స్కీ  డైవ్‌ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. అతని భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరగడంతో నొప్పితో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.  దీంతో అతను ఇరు జట్లకు కీలకంగా మారిన బ్రిస్బేన్‌ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఏ తెలిపింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts