telugu navyamedia
తెలంగాణ వార్తలు

నాకు పార్టీలో అవ‌మానం జ‌రుగుతోంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

*కాంగ్రెస్‌పై అవ‌గాహ‌న లేనివాళ్లు ఇబ్బందిపెడుతున్నారు..
*జ‌గ్గారెడ్డిపై ఇంటికెళ్ళి విహెచ్ రాయ‌బారం..
* నేను ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు..
* నాకు పార్టీలో అవ‌మానం జ‌రుగుతోంది..
*జగ్గారెడ్డికి కాంగ్రెస్ నేత‌లు బుజ్జగింపులు
* మ‌ధ్యాహ్నం కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాను..

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి.

దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేరుగా జగ్గారెడ్డి‌తో భేటీ అయి చర్చలు జరిపారు. ఆయన అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్.. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని బతిమిలాడారు.

మరోవైపు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్ ను కలవాలని, రాజీనామా చేయవద్దని సూచించారు.

ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై స్పందించిన జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తాను టీఆర్‌ఎస్‌ కోవర్టు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని..టీఆర్‌ఎస్‌లోకి పోవాలంటే రెండేళ్ల క్రితమే పోయేవాడినని అన్నారు.

పార్టీ కోసం పనిచేస్తున్న.. అవమానాలు పాలు కావాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తనను టీఆర్ఎస్ కోవర్టుగా చిత్రీకరిస్తుండటంపై జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది.

అయితే..పార్టీలో పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తన నిర్ణయాన్ని ఈ రోజు మధ్యాహ్నం ప్రకటిస్తానని చెప్పారు.

Related posts