telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు ..

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబి బాస్ కేసీఆర్ నేటితో 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

ఈ క్ర‌మంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

అలాగే ..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని వారంతా ఆకాంక్షించారు.

 తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు

డీఎంకె అధినేత, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కూడా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘డీఎంకె పార్టీ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి, దక్షిణాది దిగ్గజ నేత కె.చంద్రశేఖర్ రావుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలంగాణ కోసం,దేశం కోసం ఆయన మరిన్ని సంవత్సరాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

Related posts