కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సీపీఐ నారాయణ అన్నారు. వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వాసులపై, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సమస్యలపై ఆలస్యంగా నైనా సరే దృష్టి పెట్టినందుకు సీఎం కేసీఆర్ కు నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.
కష్ట కాలంలో ప్రజలకు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణ ప్రాంతాల్లో పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న విశ్వాసం కేసీఆర్ కల్పించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ప్రైవేటు ల్యాబ్ ల పాలిట వరంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ ఆసుపత్రి తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను జిల్లా స్థాయి వరకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
‘కరోనా’ మహమ్మారిపై పోరాడుతున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర వ్యాఖ్య ఆయన చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లల్లో ఉంటున్న వారి కోసం టీవీలో తమ కార్యక్రమాల ద్వారా ప్రజానీకానికి ఎంటైర్ టెయిన్ మెంట్ అందిస్తున్న సుమకు తన కళాభివందనాలు తెలుపుతున్నానని అన్నారు.
చంద్రబాబు జోలె పట్టి నాటకాలాడుతున్నారు: అంబటి