telugu navyamedia
తెలంగాణ వార్తలు

నా నాయకుడు, నా తండ్రి అని నేను గర్వంగా పిలుచుకునే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టిన రోజు నేడు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

‘‘పెద్ద పెద్ద కలలు కనే వ్యక్తికి, అసాధ్యాన్ని సాధ్యమయ్యే కళగా మార్చుకున్న వ్యక్తికి, దయతో నిండిన హృదయంతో అందర్నీ నడిపించే వ్యక్తికి, ధైర్యాన్ని నిర్వచించే, గడ్డు పరిస్థితులను సవాలు చేసే వ్యక్తికి, నా నాయకుడు, నా తండ్రి అని నేను గర్వంగా పిలుచుకునే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు సుదీర్ఘకాలం జీవించాలి.’’ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

CM favours one-man-one-post formula, but KCR and son KTR can be exceptions | Hyderabad News - Times of India

దశబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి.. ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది.

Harish Rao Wishes CM KCR On His Birthday: తెలంగాణ సీఎం కేసీఆర్ కారణజన్ములు, బర్త్‌డే విషెస్ తెలిపిన హరీష్ రావు | CM KCR Birthday | తెలంగాణ News in Telugu

మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ ఆర్థిక మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ కప్ ఫినాలేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

(కేసీఆర్‌ జన్మదిన వేడుకలు)

కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో పది మంది దివ్యాంగులకు ట్రై సైకిల్ ఎలక్ట్రిక్ వాహనాల్ని తానే స్వయంగా అందజేశారు. 

 

Related posts