telugu navyamedia
వార్తలు సామాజిక

వీడియో ఫైల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి: వాట్సాప్ సూచన

mail provided by dot for whatsapp affected

వాట్సాప్ లోని ఓ చిన్న లోపాన్ని ఆధారంగా చేసుకుని ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో దాడులకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. గుర్తు తెలియని సోర్స్ ద్వారా వీడియో లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లకు స్పష్టం చేసింది. ఫోన్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ ను డిజేబుల్ చేయడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది.

వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సైబర్ దాడుల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది.ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు ‘పెగాసస్’ అనే స్పైవేర్ బారినపడిన విషయం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆ విషయం మరుగున పడకముందే హ్యాకర్లు మరో రూపంలో వాట్సాప్ పై దాడులకు పాల్పడుతున్నారు.

Related posts