telugu navyamedia
క్రీడలు వార్తలు

ద్రవిడ్‌కు ఎవరు మద్దతు ఇవ్వలేదు…

మాజీ క్రికెటర్ ది వాల్ రాహుల్ ద్రవిడ్ తన సారథ్యంలో భారత జట్టును వరల్డ్ నెంబరవన్ టీమ్‌‌గా తీర్చిదిద్దాలనుకున్నాడని, కానీ సహచర ఆటగాళ్ల నుంచి అతనికి మద్దతు లభించలేదన్నాడు గ్రెగ్ చాపెల్‌. ‘ద్రవిడ్ భారత్ జట్టును వరల్డ్ బెస్ట్ టీమ్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అతని సహచర ఆటగాళ్లకు అలాంటి ఫీలింగ్ లేదు. ముఖ్యంగా కెరీర్ చివరి దశకు చేరిన సీనియర్ ఆటగాళ్లు ఎంత సేపు జట్టులో చోటు కాపాడుకోవడంపైనే దృష్టిసారించారు. ద్రవిడ్‌కు కావాల్సిన మద్దతు అందించలేకపోయారు.’అని చాపెల్ తెలిపాడు. అయితే సౌరవ్ గంగూలీపై వేటు వేయడంతో ఆటగాళ్లంతా దారిలోకి వచ్చారని, తమకు 12 నెలలు అద్భుతంగా సాగిందన్నాడు. ‘సౌరవ్ గంగూలీని జట్టు నుంచి తప్పించడంతో మిగతా ఆటగాళ్లంతా మా దారిలోకి వచ్చారు. ఎందుకంటే సౌరవ్ గంగూలీపై వేటు వేసినప్పుడు తమపైనా కూడా వేయవచ్చనే భావనతో ఆటపై దృష్టి సారించారు. ఓ 12 నెలలు అద్భుతంగా సాగింది. కానీ ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో గంగూలీ జట్టులోకి వచ్చాడు. ఆటగాళ్లు కూడా ఎలాంటి మార్పు అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. రెండేళ్ల పదవీ కాలం ముగిశాక బీసీసీఐ నా కాంట్రాక్టు‌ పొడిగిస్తామని చెప్పినప్పటికీ.. ఈ ఒత్తిడి అవసరం లేదని తప్పుకున్నాను’అని చాపెల్ చెప్పుకొచ్చాడు.

Related posts