telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళా ఆర్టీసీ కార్మికులకు .. రాత్రి విధుల నిషేధం..

no night duties to women rtc

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వారి డిమాండ్లను.. ఒకొక్కటిగా యాజమాన్యం పరిష్కరిస్తూ వస్తుంది. నిర్దేశించిన సమయంలోగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదేశించడంతో.. తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగుల డ్యూటీ టైమింగ్ ను పూర్తిగా సవరించారు. ఇప్పటి వరకు రాత్రి పది, పదకొండు గంటల వరకు కూడా విధులు నిర్వహిస్తూ వచ్చిన మహిళా కండక్టర్లు.. ఇక మీదట రాత్రి 8 గంటల లోపే విధులు ముగించే అవకాశాన్ని కల్పించారు.

మహిళ కార్మికులకు డ్రెస్‌కోడ్‌ కూడా మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఖాకీ డ్రెస్‌ స్థానంలో మరో రంగు డ్రెస్‌ ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించడంతో ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న యాజమాన్యం చెర్రీ రంగు యాప్రన్‌ డ్రెస్‌ను కన్ఫర్మ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఉద్యోగినికి రెండు డ్రెస్‌ల చొప్పున మొత్తం 9వేల వరకు యాప్రన్లు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు కూడా మూడు నెలల పాటు చైల్డ్‌కేర్‌ లీవ్స్‌పై రెండ్రోజుల్లో ఆదేశాలు ఇవ్వనున్నారు. డిపోలవారీగా మహిళలకు టాయిలెట్లు, డ్రెస్‌చేంజ్‌ గదులను తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్నారు.

Related posts