telugu navyamedia
తెలంగాణ వార్తలు

 మైనర్ బాలిక అత్యాచారం : టీఆర్‌ఎస్‌ నుంచి సాజిద్ ఖాన్ సస్పెండ్‌ …

 *నిర్మల్ మైనర్ బాలిక అత్యాచారం…

*టీఆర్ఎస్ పార్టీనుండి సాజిద్ సస్పెండ్

*బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తాం

నిర్మల్ జిల్లా లోని వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన మైనర్ బాలికపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఈక్రమంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ బాలికపై గత కొన్ని రోజుల నుంచి సాజిద్ అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా సమాచారం.. ఆమెను బెదిరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు ఒడిగట్టేవాడని తెలిసింది.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నైతిక బాధ్యత వహిస్తూ సాజిద్‌ఖాన్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాజిద్‌ ఖాన్‌ టీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేస్తున్నట్లు ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించారు. మైనర్ పై అత్యాచారం అత్యంత హేయమైన చర్య… టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

అంతేకాకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఇంద్రకరణ్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అత్యాచారంపై ఫిర్యాదు అందించవెంటనే పోలీసులు వెంటనే సాజిద్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో వుందని మంత్రి ఇద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts