telugu navyamedia
సినిమా వార్తలు

ఓటీటీలోకి ‘డీజే టిల్లు…సంద‌డి షూరూ..

యంగ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా వ‌చ్చిన‌ చిత్రం డీజే టిల్లు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సితారా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైంది.

ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో అత్యధిక వసూళ్ళు సాధించింది. థియేటర్లలో టిల్లుగాడి లొల్లికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువత బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాసలో సిద్ధు చెప్పే డైలాగ్స్, నేహా శెట్టి అందం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక సినిమాలో రామ్ మిర్యాల పాడిన డీజే టిల్లు సాంగ్ బాగా పాపులర్ అయింది..

అయితే క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న ‘ఆహా’ వారు మార్చ్ 4న డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతున్నారు. థియేటర్లలో సందడి చేసిన డీజే టిల్లు ఓటీటీలోకి రానుంది

ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన వారు ఈ శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. తమన్, శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ సినిమాకి సంగీతం అందించారు. 

Related posts