కరోనా బాధితులను ఆదుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రోనాను కట్టడి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయటంలేదని ఆరోపించారు. కరోనా బాధితుల కోసం తక్షణమే 5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రికి 3 వేల కోట్లు.. మిగిలిన జిల్లా ఆస్పత్రులకు 2 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
సీఎం సహాయ నిధికి వచ్చిన విరాళాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సీఎం సొంత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవటం సిగ్గుచేటన్నారు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో వెంటిలేటర్స్ సైతం అందుబాటులో లేవన్నారు. గ్రామాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం ఆందోళనకరంగా ఉందన్నారు.