telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మోదీ ట్వీట్ కు స్పందించిన ట్రంప్

modi trump

అగ్రరాజ్యం అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమెరికా ప్రజలను విష్ చేసిన సంగతి తెలిసిందే. మోదీ ట్వీట్ ను చూసిన ట్రంప్, దానికి సమాధానం ఇచ్చారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ “నా నేస్తమా కృతజ్ఞతలు. అమెరికా లవ్స్ ఇండియా” అని ఆయన అన్నారు. నిన్న అధ్యక్షుడు ట్రంప్, దక్షిణ డకోటా ప్రాంతంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి వేడుకలకు హాజరైన వారిని ట్రంప్ నవ్వుతూ పలకరించారు.

Related posts