ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల ఏం చేసిన సంచలనంగానే మారుతుంది. అయితే ప్రస్తుతం ఆవిడ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. మొదట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు అని తెలిపిన షర్మిల ఇప్పుడు క్రమంగా సమస్యలు, ప్రాజెక్టులపై కూడా స్పందిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ నెల 15 న షర్మిల పార్టీలో ఏపూరి సోమన్న చేరనున్నారు. షర్మిల పార్టీలో చేరేందుకే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ని విమర్శించాలన్న ఆలోచన తనకు లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద నమ్మకం లేదని చెప్పారు. పార్టీలో సీనియర్లు కూడా వారి భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని.. తెలంగాణలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని ఏపూరి సోమన్నా పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. కొత్త పార్టీ పెట్టనున్న వైఎస్ షర్మిల జెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. లేత ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులతో ఉండే జెండా మధ్యలో తెలంగాణ చిత్రపటం అందులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటో ఉంటాయని సమాచారం అందుతోంది. ఇక షర్మిల పార్టీ పెట్టడంపై తెలంగాణలోని అన్ని పార్టీలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆంధ్ర వాళ్ల పెత్తనం మళ్లీ తెలంగాణలో అవసరమా ? అని ఇప్పటికే తెలంగాణలోని అన్ని పార్టీలు ప్రశ్నించాయి.
previous post
రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదు: సీపీఐ నారాయణ