telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్రం వరి కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేత‌లు పొరుబాట‌..

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది.

తెలంగాణ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నేటి నుంచి ఆందోళనకు టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మండల కేంద్రాల్లో రైతులు, టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు.

ఈనెల 11న దేశ రాజధాని డిల్లీలో టీఆర్‌ఎస్‌ నేతల నిరసన వ్యక్తం చేయనుంది. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ప్రజాప్రతినిధులంతా ఈ నిరసనలో పాల్గొననున్నారు.

ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం టీఆర్ఎస్ ముందస్తుగానే ఏర్పాటు చేసుకుంటోందని… వాటిపై కూడా సమాలోచనలు జరిపేందుకు సీఎం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

Related posts