telugu navyamedia
తెలంగాణ వార్తలు

గులాబ్ తుపాను ఎఫెక్ట్‌..

గులాబ్ తుపాను ఎఫెక్ట్ వ‌ల్ల‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీని మూడు రోజుల పాటు వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాలపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రొటెం ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. సభా నాయకుడు, ఆయా పక్షనేతలు, సభ్యుల విజ్ఞప్తి మేరకు సమావేశాలకు విరామం ప్రకటించారు.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థల‌కు 28న ప్రభుత్వం సెల‌వులు ప్రక‌టించారు.. రాష్ట్రంలోని ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర స్థాయిలో ఉండి వ‌ర్షాలు, వ‌ర‌ద‌ ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తే ప్రజాప్ర‌తినిధులంద‌రూ రాజ‌ధానికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. కాబ‌ట్టి.. అసెంబ్లీ స‌మావేశాల‌ను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌లు తిరిగి స‌మావేశం కానున్నాయి.

Related posts