telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 28(మంగళవారం) రాశి ఫలాలు

మేషం: ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులకు అనుకూలం. బంధుమిత్రుల సహాయం అందుతుంది.

వృషభం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులు తమ ప్రయత్నాల్లో చక్కని ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు జాగ్రత్తలు అవసరం. స్నేహితుల సహకారం తీసుకుంటారు. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వివాహ సంబంధాలకు అనుకూలం.

మిథునం: వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు సానుకూలం. పని ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులకు అభివృద్ధి కనిపిస్తోంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. స్నేహితుల సహకారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

సింహం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు అనుకూలం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు లాభదాయకం. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఖర్చులను అదుపుచేయాలి. శుభవార్తలు వింటారు.

తుల: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు శుభ ఫలితాలు. ఉద్యోగంలో హెూదా పెరిగే అవకాశం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొత్త పరిచయాలకు అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. ఆర్జిస్తారు.

వృశ్చికం: ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు లాభదాయకం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వివాహ సంబంధాలకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. వ్యాపారులకు లాభదాయకం. ఇతరులకు మీవల్ల మేలు జరుగుతుంది. పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

మకరం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు లాభదాయకం. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి తప్పదు. వివాహ సంబంధాలకు అనుకూలం.

కుంభం: ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులకు లాభదాయకం. వివాహ సంబంధాలకు అనుకూలం.

మీనం: ఉద్యోగులకు అనుకూల వాతావరణం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు శ్రమపడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. వివాదాలకు పోవద్దు.

Related posts