telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 24, శుక్రవారం రాశిఫలాలు

మేషరాశి..

ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటా, బయటా మీకు శ్రమ పెరుగుతుంది. బంధుల‌తో బంధువులతో ఆచితూచి వ్యవహరించ‌డం మంచిది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటాయి.

వృషభరాశి..

గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ఆదుకునే వారుంటారు. దైవ‌ కార్యాలలో పాల్గొంటారు. మీ శ్రమకు మంచి గుర్తింపు వ‌స్తుంది. సంఘంలో ఆదరణ లభిస్తాయి. అనుకోని దూర‌ ప్రయాణాలు చేస్తారు. ద‌గ్గ‌ర‌వారి నుంచి ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుప‌డుతుంది.

మిథునరాశి..

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. స్త్రీలకు అధిక ఒత్తిడి, శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు అంత‌గా క‌లిసిరావు.

కర్కాటకరాశి..

కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. నిజాయితే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ఖ‌ర్చులు త‌గ్గించి, పొదుపు పాటించండం మంచిది. కుటుంబంలో క‌ల‌హాలు ఎక్కువవుతాయి. వృత్తి వ్యాపారులకు అధిక శ్రమ ఉండును. శ్రమకు త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌దు. వ్యాపారాలు, ఉద్యోగాలు మ‌ధ్య‌మంగా ఉంటాయి.

సింహరాశి..

స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధువుల రాకతో కుటుంబంలోని వారు స‌ర‌దాగా ఉంటారు. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. నూతన ఉద్యోగప్రాప్తి క‌లుగుతుంది. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం ల‌భిస్తుంది.

కన్యరాశి..

నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజ‌యం సొంతమవుతుంది. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పనుల్లో అండంకులు ఏర్ప‌డ‌తాయి, అనారోగ్యం బారిన ప‌డ‌తారు. ఉద్యోగాల్లో పై అధికారులు నుంచి ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త గా ఉండాలి.

తులరాశి..

సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం, మహిళలకు పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధనప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. బొండి బాకీలు వసూలవుతాయి. దైవ‌ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఏర్ప‌డ‌తాయి.

వృశ్చికరాశి..

ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్ప‌డుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

ధనుస్సురాశి..

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు మిత్రులతో కలహాలు స్వీక‌రిస్తారు. ఆరోగ్యభంగం క‌లుగుతుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలుల, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు ఏర్ప‌డ‌తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరరాశి..

ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణయత్నాలు. కుటుంబంలో బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి.

కుంభరాశి..

బ‌య‌టివారి ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త పనులకు శ్రీకారం చుడ‌తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తు, వస్త్రలాభాలు ల‌భిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జ‌రిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

మీనరాశి..

వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. నిరుద్యోగులకు ఉద్యోగ‌వ‌కాశాలు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వాహనయోగం క‌లుగుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీరేంటో నిరూపించుకుంటారు.శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

Related posts