telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్‌ 3(ఆదివారం) రాశి ఫలాలు

మేషం: ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ఖర్చులు అధికమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమయం అనుకూలం గా ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి.

వృషభం: అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది.

మిథునం: ఉపాధ్యాయులకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. ఉద్యోగులు సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.

కర్కాటకం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

సింహం: కొబ్బరి, పండ్లు, చల్లని, పానీయ వ్యాపారులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. సామాజిక హోదా పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు.

కన్య: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ౦ నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. వృతి నిపుణులకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు.

వృశ్చికం: చిరు వ్యాపారులకు అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

ధనస్సు: ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు. రవాణా, ఆటోమోబైల్, రంగాల వారికి బాగుంటుంది. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు.

మకరం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. గృహోపకరణాల కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాయిదాపడ్డ పనులు పూర్తవుతాయి.

కుంభం: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కొత్త అవకాశాలు అందుకుంటారు. కీలక సమస్యను పరిష్కరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Related posts