కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటాకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
జనవరి 1, 13 నుంచి 22 వరకు రోజుకు 20 వేల టికెట్ల చొప్పున.. అలాగే జనవరి 2 నుంచి 12 వరకు రోజుకు 12 వేల టికెట్ల చొప్పున విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. జనవరి 23 నుంచి 31 వరకు రోజుకు 12 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తితిదే వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
బాబు అప్పుడు హైదరాబాద్ వదిలివచ్చారు..ఇప్పుడు అక్కడికే పారిపోయారు!