telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 15, బుధవారం రాశిఫలాలు…

మేష రాశి..

బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ప్రశంసలను పొందుతారు. సంతోషంగా గడుపుతారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా బలపడతారు. స్త్రీలలు ఈరోజు సంతోషంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి.

వృషభ రాశి..

కీలక వ్యవహారాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కొత్త పనులను చేపడతారు.ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. కొత్తవస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

మిధున రాశి..

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్తపనులను ఉత్సాహంగా చేపడతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కొత్త పనులు చేపడతారు. చేసిన అప్పులు తీరుస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

కర్కాటక రాశి..

బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

సింహ రాశి..

స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. కుటుంబం విషయంపై అనాసక్తత ఏర్పడుతుంది. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. దైవారాధన చేయ‌డం మంచిది. ముఖ్య‌మైన‌ పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.

కన్య రాశి..

వృత్తి,ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. విద్యార్థులకు అనుకులంగా ఉంది. ఇంట్లో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనులు సులభంగా జరుగుతాయి.

తుల రాశి..

మానసిక ఆందోళన తొలగి.. సంతోషంగా ఉంటారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవ‌డం మంచిది. చేప‌ట్టిన పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వస్త్ర వ్యాపారులకు లాభదాయకం. అనవసర విషయాల్లో తలదూర్చక‌పోవ‌డం మంచిది.

వృశ్చిక రాశి..

బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు మంచి కాలం న‌డుస్తుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి..

ఆకస్మికంగా అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. మ అధికారులతో అప్రమత్తంగా ఉండ‌డం మంచిది.

మకర రాశి..

సోదరీ, సోదరులతో గొడ‌వ‌లు ఎదుర‌వుతాయి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయ దర్శనాలు చేస్తారు.

కుంభ రాశి..

ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విందు వినోద కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్త్రీ వలన ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.

మీన రాశి..

ఆకస్మిక ధననష్టాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరాస్తివిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లో ఉన్నవారు మానసిక ఆందోళనకు గురవుతారు. కొత్తగా చేపట్టే పనులను వాయిదా వేసుకోవడం మంచిది.దైవ ద‌ర్శ‌నం చేయ‌డం మంచిది.

Related posts