telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ భార్య స్నేహపై సమంత ‘హాట్‌’ కామెంట్స్‌..

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఏ మాత్రం హీరోయిన్ కి తీసిపోని అందం, ఫిజిక్ ఆమె సొంతం.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా స్నేహ అందం మాత్రం చెక్కుచెదరలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తగ్గట్టే స్టైలిష్ వైఫ్ దొరికింది.

Allu Sneha Reddy beautiful photos in black saree

అర్జున్‌తో కలసి స్నేహ పలు ఈవెంట్స్ లో కనిపిస్తూ అంద‌రిని ఎట్రాక్ట్ చేస్తుంటారు. స్నేహ డిఫ‌రెంట్ స్టైల్‌లో ట్రెండ్ ఫాలో అవుతోంది. ఫంక్షన్స్, పార్టీలలో విభిన్నమైన అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఆకర్షిస్తోంది.

అలాగే ఎప్పటికప్పుడు తన డిజైనర్ డ్రెస్ ల్లో ఫోటోషూట్లను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు సోష‌ల్‌మీడియా లో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Allu Sneha Reddy beautiful photos in black saree

ఇక తాజాగా అల్లు స్నేహ బ్లాక్ శారీ ఫోటో షూట్ లో మెరిసింది. తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. మల్హోత్ర డిజైన్ చేసిన బ్లాక్ కలర్ శారీ విత్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో స్నేహారెడ్డి అందరిని ఆకర్షిస్తోంది.

సెలెబ్రిటీలు సైతం ఆమె ఫోటోషూట్ పై కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా సమంత కూడా స్నేహారెడ్డి ఫోటోలపై స్పందించింది. హాట్ అంటూ రెడ్ ఎమోజీ ని యాడ్ చేసి కామెంట్ పెట్టింది ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది.

Samantha Charges Bomb For Pushpa Song! - Movie News

కాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టిన ఈ పాట ప్రస్తుతం ‘పుష్ప’ థియేటర్లను ఊపేస్తోంది.

Related posts