telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పిఆర్సీ నివేదిక విడుదల చేయండి…

నిన్న సాయంత్రం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వతరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ డైరీలను బహుకరించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పిఆర్సీ పై చర్చలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలుస్తామని, తేదీ ఖరారు చేసి సంఘాలకు సమాచారం తెలియజేస్తామన్నారు. సంఘాల ప్రతినిధులు సిఫారసులను అధ్యయనం చేయటానికి వీలుగా పిఆర్సీ నివేదికను చర్చలకు ముందుగానే బహిర్గతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరగా నివేదిక ఇంకా సీల్డ్ కవర్ లోనే ఉన్నదని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నివేదికను తెరిచి అధ్యయనం చేసి ముఖ్యాంశాలతో నోట్ విడుదల చేస్తామన్నారు. అయితే అది సరైంది కాదని, మొత్తం నివేదికను విడుదల చేయటమే సాంప్రదాయం కనుక దానిని పాటించాలని నేతలు సిఎస్ కు స్పష్టం చేశారు. పదోన్నతుల విషయమై ప్రస్తావించగా, పదోన్నతుల పై అన్ని శాఖలకు ఆదేశాలిస్తున్నామని, ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశిస్తామన్నారు.

Related posts