telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున పుట్టినరోజు సర్ప్రైజ్ గా “వైల్డ్ డాగ్” ఫస్ట్ లుక్

Wild-Dog

టాలీవుడ్ కింగ్, మన్మధుడు అక్కినేని నాగార్జున 61వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా నాగార్జునకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా తాజాగా నాగార్జున నటిస్తున్న “వైల్డ్ డాగ్” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. ఊపిరి, మహర్షి చిత్రాలకి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు నాగ్. ఇందులో ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో ఆకట్టుకున్న అలీ రెజా కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దాదాపుగా 70 శాతం కంప్లీట్ చేసుకుంది.

Related posts