telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఫిషియల్ : విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య

Thank-You

ఈ రోజు (ఆగస్టు 29)న కింగ్ నాగార్జున 61వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతూ, విక్రమ్ కె.కుమార్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్. ఇష్క్ సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన విక్రమ్… ఏకంగా అక్కినేని కుటుంబం డ్రీం ప్రాజెక్ట్ ‘మనం’ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో విక్రమ్ కె.కుమార్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత అఖిల్ తో చేసిన ‘హలో’ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా అక్కినేని నాగచైతన్యతో సినిమాని చేసేందుకు రెడీ అయిపోయారు విక్రమ్. ఇక దిల్ రాజు సంస్థలో నాగచైతన్య కూడా ఇదో రెండో సినిమా. అంతకుముందు వీరి కాంబినేషన్ లో జోష్ అనే సినిమా తెరకెక్కింది. నాగ‌చైత‌న్యకి ఇది 20వ సినిమా కావడం విశేషం.. త్వరలోనే నటీనటులను ఎంపిక చేయనున్నారు.

Related posts