telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్ ..’లా లా భీమ్లా’ డీజే వెర్షన్​ రిలీజ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’.మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ తెర‌కెక్కుతుంది.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పవన్‌కల్యాణ్‌.. ‘భీమ్లానాయక్‌’ అనే పోలీస్‌ అధికారిగా, రానా.. ‘డేనియల్‌ శేఖర్‌’ పాత్రలో కనిపించనున్నారు. పవన్‌ సరసన నిత్యామేనన్‌, రానాకు జంటగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు.

DJ version of 'La La Bheemla' is out! - Telugu News - IndiaGlitz.com

ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘లాలా భీమ్లా’ సాంగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ సాంగ్‌ మిలియన్ల కొద్ది వ్యూస్‌ సొంతం చేసుకుంది .

సంక్రాంతికి జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా భీమ్లానాయక్ రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేందుకు ‘భీమ్లానాయక్‌’ టీమ్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘లాలా భీమ్లా’ పాట డీజే వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సంవత్సర వేడుకల్లో లాలా భీమ్లా డీజేతో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందే అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు.

భీమ్లా నాయ‌క్ న్యూ ఇయ‌ర్ ట్రీట్‌.. లాలా భీమ్లా డీజే సాంగ్ వ‌చ్చేసింది

‘‘డీజే సౌండ్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు త‌మ‌న్‌. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న శివ రాత్రి సంద‌ర్భంగా సినిమా 2022 ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌వుతుంది.

Related posts