telugu navyamedia
రాశి ఫలాలు

జనవరి 1, శనివారం రాశిఫలాలు..

మేషరాశి..

బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఏర్ప‌డ‌తాయి. స్త్రీలు తమ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పొగొట్టుకుంటారు.

వృషభరాశి..

చిరు వ్యాపారులకు మంచిగా ఉంటుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. శుభవార్తలు వింటారు.. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన ఫ‌లితం క‌నిపిస్తుంది. మిత్రులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. వాహనయోగం కులుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఖర్చులు తగ్గుతాయి, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

మిథునరాశి..

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం క‌లుగుతుంది. వస్తులాభాలు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధు, మిత్రుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.

కర్కాటకరాశి..

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాలను మిగులుస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. దూరప్రయాణాలు చేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేప‌డ‌తారు.

సింహరాశి..

సోదరులు, సోదరీమణులు కూడా కలిసి ఉండవచ్చు కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం మంచిది.. రుణాలు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మిత్రుల నుంచి సమస్యలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

కన్యరాశి..

సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.బంధువులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. శుభవర్తమానాలు. వ్యాపార పరిస్థితులు మరింత బలపడతాయి. తండ్రి సహకారం కొనసాగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఆలయాల సందర్శనం చేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో పై అధికారులు నుంచి ఒత్తిడులునుంచి అధిక‌మిస్తారు.

తులరాశి..

పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కొన్ని ముఖ్యమైన పనిలో మద్దతు పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి. కొత్త అప్పులు చేస్తారు .వ్యాపారాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో ప‌ని ఒత్తిడి ఎక్కువ‌వుతుంది.

వృశ్చికరాశి..

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. బంధువులరాకతో గృహంలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

ధనుస్సురాశి..

బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అవుతుంది. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి.

మకరరాశి..

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడ‌తారు. కుటుంబంలో శుభకార్యాలు జ‌రుగుతాయి. ధనలాభం క‌లుగుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్య‌మైన ప్ర‌ముఖుల‌తో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.

కుంభరాశి..

ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఉద్యోగాలలో ఒత్తిడులు నుంచి అధిక‌మిస్తారు.

మీనరాశి..

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తొలుగుతాయి. వ్యాపారాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.

Related posts