telugu navyamedia
సినిమా వార్తలు

సీనియర్ నటుడు ఇంట తీవ్ర విషాదం..

ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

ఆమెకు ఇద్దరు కుమారులుండగా.. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టివి రంగాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రెండో కొడుకు వెంకట్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు.

కమలమ్మ అంత్యక్రియలు గురువారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మహర్షి రాఘవ తల్లి మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

కాగా హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర ప్రేక్షకులకు అయితే విలన్‌గా ఎంతో సుపరిచితుడు. సీనియర్ డైరెక్టర్ వంశీ రూపొందించిన `మహర్షి` మూవీతో హీరోగా నటించి పాపులర్‌ అయిన రాఘవ ఆ చిత్రాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన మెప్పించారు.

`జంబలకిడిపంబ`, `చిత్రం భళారే విచిత్రం`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే.. పలు సీరియల్స్‌లోనూ సైతం నటిస్తున్నారు.

Related posts