“ఆర్.ఎక్స్100” సినిమాతో పాయల్ రాజ్‌పుత్‌కు అనూహ్యమైన క్రేజ్ వచ్చి పడింది. దాంతో అమ్మడిని వరుస అవకాశాలు చుట్టి ముట్టేశాయి. అయితే ఈ బోల్డ్ బ్యూటీ మాత్రం రవితేజ “డిస్కోరాజా”లోనూ, బాలయ్య, కే.యస్ రవికుమార్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. అయితే వీటితో పాటు మరో చిన్న సినిమాకూ పాయల్ రాజ్‌పుత్ సైన్ చేసిందట. అయితే ఈ మధ్యే సెట్స్ మీదకు వెళ్లిన సినిమా డైరెక్టర్ కొత్త దర్శకుడు కావడం వల్లనో ఏమో తెలియదు కానీ పాయల్ ఆ సినిమా సెట్స్‌కు లేట్‌గా రావడం, కేరవాన్‌లో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడడం చేసిందట. దాంతో ఆ సినిమా దర్శకుడు ఆమెను ప్రశ్నించాడట. దీంతో అమ్మడు తలబిరుసుగా సమాధానం చెప్పిందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ పాయల్ రాజ్‌పుత్ మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వ్యతిరేకత ఏర్పడిందని తెలుస్తోంది. ఒక్క సినిమాకే ఆమె అలాంటి యాటిట్యూడ్ చూపించడం ఆమె కెరీర్‌కు ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు. అయితే పాయల్ రాజ్‌పుత్ అలాంటి అమ్మాయి కాదని, సెట్స్‌లో ఏదో అనీజీగా అనిపించడంతోనే ఆమె అలా ప్రవర్తించిందని కొందరు ఆమె తరపున మాట్లాడుతున్నారు. మరి తనపై వస్తోన్న ఈ ఆరోపణలకు పాయల్ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.
previous post
ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్