మాళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ దర్శకత్వంలో ‘ఆడు జీవితం’ పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్ ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్కడి పరిస్థితులు బాగోలేవని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినలేదట. తీరా అక్కడికి వెళ్లిన తరువాత కరోనా తీవ్రరూపం దాల్చింది. ఇండియా లాక్ డౌన్ అయింది. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు తమను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలంటూ వారంతా కోరుతున్నారు. ఎడారి ప్రాంతం కావడంతో తినడానికి సరిగా తిండి కూడా ఏం దొరకడం లేదంట. తమ కష్టాల్ని గుర్తించి వెంటనే తమను ఇండియాకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని వాపోతున్నారు.,కీలక సన్నివేశాలను జోర్డాన్ ఎడారిలో చిత్రీకరించడానికి అక్కడి ప్రభుత్వం నుండి ఆదేశాలను పొందారు. ఏప్రిల్ పది వరకు షూటింగ్ జరుపుకోవాల్సిన ఈ సినిమా కరోనా ఎక్కువగా ప్రబలుతుండటంతో అక్కడి అధికారులు షూటింగ్‌ను ఆపేయాల్సిందిగా కోరారు. దీంతో 58 మంది సభ్యులున్న యూనిట్ ఇప్పుడు అక్కడే చిక్కుకుపోయింది. మన దేశానికి విమాన రాకపోకలు కూడా లేకపోవడంతో ఎంటైర్ యూనిట్ అక్కడే ఉండిపోయింది. ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి లేఖ రాశాడు.