బిగ్ బీ ఇటీవల అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత అతనిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ పూర్తి ఉత్సాహంతో కనిపిస్తుండగా, ఆయన కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసే పనిలో పడ్డారు. కాగా… కొన్ని సంవత్సరాలుగా మంచి రేటింగ్‌తో దూసుకెళుతున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని పలు ప్రాంతీయ భాషలలోను షోస్ రూపొందుతున్నాయి. అయితే బిగ్ బాస్ హోస్ట్‌గా రూపొందుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి అనుకోని అతిధి హాజరైంది. షో ఆడలేక చతికిల పడింది. ఈ విషయాన్ని బిగ్ బీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షో సెట్‌లోకి వచ్చిన పిల్లి కేబీసీ ఆడటానికి వచ్చింది. ఫాస్టెస్ట్ ఫింగర్ వరకు వచ్చింది. కాని ఆడలేక అక్కడే చతికిల పడింది అంటూ పిల్లి పడుకున్న ఫోటోలని జత చేసి ట్వీట్ చేశారు .ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
T 3534 – 🤣🤣🤣
ऐ बिलौरी , बिल्ली बिल्ली , खेलन चली KBC
जैसे आइ Fastest Finger, लोट पोट हो गयी वहीं ~ अब pic.twitter.com/3pq49UfSXR— Amitabh Bachchan (@SrBachchan) 30 October 2019
బిగ్ బాస్ పై రేణూదేశాయ్ కామెంట్స్