telugu navyamedia
క్రైమ్ వార్తలు

మైన‌ర్‌బాలికపై 6నెల‌లుగా ఆత్యాచారం..64మంది అరెస్ట్‌

*గుంటూరులోని కుదేపేస్తోన్న‌ మైన‌ర్‌బాలిక ట్రాప్‌కింగ్‌
*ప‌రిచ‌యం పెంచుకుని ప‌డుపు వృత్తి లోకి దించిన స్వ‌ర్ణ కుమారి
*బాలిక‌పై అఘాయ‌త్నానికి పాల్ప‌డిన 64 మంది అరెస్ట్..
*కోవిడ్ ఆస్పత్రిలో చేరిన చిన్నారిని అమ్మేసిన కిలాడి లేడీ
*13 ఏళ్ళ చిన్నారి జీవితంలో క‌రోనా సృష్టించిన క‌ల‌క‌లం..
*డిసెంబ‌ర్‌25న పోలీసులు మీడియా ముందుకు నిందితులు
*పసిపిల్ల‌పై 6 నెల‌లుగా ఆత్యాచారం..

గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో.. 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏళ్ళ చిన్నారి జీవితంలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది..

వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు లో గత ఏడాది డిసెంబ‌ర్‌లో జూన్ లో తల్లికూతుళ్ళకు కరోనా సోకింది. దీంతో భర్త తన భార్య, కూతురిని జీజీహెచ్ లో చేర్పించాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. ఆ సమయంలో స్వర్ణకుమారి అనే మహిళ ఆ బాలికతో పరిచయం ఏర్పరుచుకుంది. మెల్లగా బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది కిలాడి లేడీ.

గుంటూరుతో పాటు విజయవాడ, కాకినాడ, తణుకు, నెల్లూరు, హైదరాబాద్ ల్లోని వ్యభిచార గృహాల్లో ఉంచి వ్యభిచారం చేయించింది. ఆరునెలల పాటు బాలిక చిత్రవధ అనుభవించి, ఆరోగ్యం క్షీణించడంతో స్వర్ణకుమారి చెర నుంచి తప్పించుకుని నేరుగా తండ్రి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పడంతో.. పోలీసులను ఆశ్రయించారు.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వర్ణకుమారి తో పాటు 23 మందిని అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకుని.. వారిపై కూడా పోక్సో చట్టంతో పాటు.. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Related posts