telugu navyamedia
సినిమా వార్తలు

చిన్మయి విన్నపం… స్పందించిన మేనకా గాంధీ

Chinmayi-Sripada

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమంలో భాగంగా సినీ ప్రముఖులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తమిళ సినిమా రంగంలో అవార్డు విన్నింగ్ రచయితగా, సెలెబ్రెటీగా కొనసాగుతున్న వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. అంతేకాదు తనలాగా బాధపడుతున్న ఎంతోమంది గురించి వెలుగులోకి తీసుకొచ్చి, వారికి మద్దతుగా నిలిచారు. అలాంటి చిన్మయిని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కష్టాలకు గురి చేస్తోంది.

తాజాగా వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలైందని, అయినా తనకు న్యాయం జరగలేదని, పైగా తనను సినిమా ఇండస్ట్రీ నుంచి తొలగించారని, డబ్బింగ్ యూనియన్ నుంచి కూడా తొలగించారని, ప్రస్తుతం తాను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నానని, తనకేదైనా దరి చూపించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. చిన్మయి ట్వీట్ పై స్పందించిన మేనకా గాంధీ మీ కేసును జాతీయ మహిళా కమీషన్ దృష్టికి తీసుకెళ్ళానని, వివరాలను తనకు పంపించాలని చిన్మయికి రిప్లై ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts