telugu navyamedia
రాజకీయ

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసీ నోటీసులు

*యూపీ ఓట‌ర్ల‌పై బెదిరించినందుకు రాజాసింగ్ చ‌ర్య‌లు
* బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఈసీ నోటీసులు

బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈసీ నోటీసులు ఇచ్చింది. యూపీ అసెంబ్లీ సంద‌ర్భంగా ఓటర్లను బెదిరించినట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ ఓ వీడియో చేశారు.

భాజపా శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు. ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి.. యోగి సర్కార్​ రావాలని ఆకాంక్షించారు.

అంతేకాకుండా యోగికి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలు పంపిస్తామని హెచ్చరించారు.. అయితే, రాజా సింగ్‌ వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం..

ఆ వీడియో ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని పేర్కొన్న ఈసీ.. రాజాసింగ్​కు నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్‌పీ చట్టం మరియు ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఎమ్మెల్యే రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

 

Related posts