telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా హీరో సినిమాలో నేను లేకపోతే ఎట్టా… “పవర్ స్టార్”పై కత్తి మహేష్

Power-Star

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా డైరెక్ట్ చేస్తున్న ‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్ లీక్ అయ్యింది. లాక్ డౌన్ లో సినిమా షూటింగులు నిలిచి పోయినా వర్మ మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ‘పవర్ స్టార్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఎన్నికల తరువాత కథ’.. అనేది ట్యాగ్ లైన్. టిక్ టాక్ లో పవన్ డూపుగా బాగా క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తిని హీరోగా తీసుకున్నాడు. పవన్ పాటలు, సీన్లు చేసుకుంటూ, జనసేన కార్యక్రమాల్లో పాటిస్పేట్ చేస్తూ వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా పవన్ యాంటీ సినిమాలో నటించడంపై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు (జూన్ 22) ఉదయం 11 గంటలకు ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. నాలుగు నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌లో పవర్ స్టార్‌ని ఎన్ని విధాలుగా తక్కువ చేసి చూపించవచ్చో.. ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టవచ్చో ఆ ట్రిక్స్ అన్నీ ఉపయోగించేశాడు వర్మ. పవన్ కళ్యాణ్ మొదలు.. చిరంజీవి, చంద్రబాబు, నాగబాబు, త్రివిక్రమ్, బండ్ల గణేష్ ఇలా అందర్నీ టార్గెట్ చేస్తూ ట్రైలర్ రూపొందించారు వర్మ. పవర్ స్టార్ ట్రైలర్‌లో.. ‘మీరు ఎన్నికల ప్రచారంలో గగన్.. సీఎం కాడు.. ఇది నా శాసనం అంటూ బాహుబలి శివగామి రేంజ్‌లో రంకెలు వేశారు.. ఇప్పుడు గగనే సీఎం.. దీనికి మీరేం అంటారు’ అంటూ పవర్ స్టార్ ప్రశ్నించే జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తున లేచే వివాదాల క్రిటిక్ మహేష్ కత్తిని తాజా ట్రైలర్‌పై స్పందిస్తూ.. ‘మా హీరో సినిమాలో నేను లేకపోతే ఎట్టా’ అంటూ పోస్ట్ వదిలారు.

మరోవైపు ‘పవర్ స్టార్ ‘ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వర్మకు, పవన్ ఫ్యాన్స్ కి మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. వర్మకు వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడి డైరెక్షన్ లో ‘పరాన్నజీవి’ అనే సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ కూడా చేస్తున్నారు.

Related posts