telugu navyamedia
వార్తలు సామాజిక

ఆకాశంలో సుందర దృశ్యం..రాహుగ్రస్త్య సూర్యగ్రహణం!

solar ecips

ఆకాశంలో వ‌ల‌యాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు రాహుగ్రస్త్య సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లైంది. మ‌న దేశంలో మాత్రం ఉద‌యం 10.14 గంట‌ల‌కు గ్ర‌హ‌ణం ప్రారంభ‌మైంది. ఈ సూర్య‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు పూర్తిస్థాయి సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపిస్తుంద‌ని చెప్పారు.

మ‌న దేశంలో ముందుగా గుజ‌రాత్‌లోని ద్వార‌క ప్రాంతంలో సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపించింది. తెలంగాణ‌లో ఉద‌యం 10.15 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.44 వ‌ర‌కు 51 శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 10.21 నుంచి మ‌ధ్యాహ్నం 1.49 వ‌ర‌కు 46 శాతం సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

Related posts