telugu navyamedia
రాజకీయ

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజల ఆకలి కేకలు

ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత కోటి నలభై లక్షల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇది మానవ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆహార వ్యవహారాలు చూసే అమెరికా డైరెక్టర్ మేరీ ఎల్లెన్ మెక్‌ గ్రార్టీ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని కాబూల్ నుంచి అమెరికా విలేఖరులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ..

ఆఫ్ఘనిస్తాన్ గత మూడు సంవత్సరాల్లో అతి పెద్ద కరువు విలయ తాండవ చేస్తోంది. పంటలు సరిగా పండటం లేదు . ప్రజలతో పాటు పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు కరోనా మరణాలు కూడా ఎక్కువగానే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది . ప్రాణ భయంతో ప్రజలు .దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లలు తాలిబన్ల ఆంక్షలతో ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. ఎవరికీ వారు భయంతో షాపులు, హోటల్స్ మూసివేశారు పట్టెడన్నం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి మరణాలు
సంభవించే అవకాశం ఉందని మేరీ ఎల్లెన్ తెలిపారు

Related posts