telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల లో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సానుకూల స్పందన

ఏపీలో ఆరు, తెలంగాణలో  నాలుగు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

ఏపీలోని ఆరు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. ఫీజిబిలిటీ స్టడీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరుతోంది.

దీనిపై ఎయిర్‌  పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలను పంపించింది. కేంద్రం నుండి కూడా సానుకూల స్పందన రావడంతో..ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఇక తెలంగాణలో కూడా నాలుగు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రామగుండం, మామునూరు, కొత్తగూడెంలో కొత్తగా విమానాశ్రయాల ను నిర్మించాలని భావిస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మామునూరు విమానాశ్రయాల కు ఇప్పటికే ఎన్ఓసీ సాధించామని..దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.

.

Related posts