telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ కల్యాణ్ పై వాలంటీర్ ల క్రిమినల్ కేసును గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేశారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును న్యాయమూర్తి ఎత్తివేశారు.

పవన్పై అభియోగాలను తొలగిస్తూ తాజాగా గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఎత్తివేతకు గల కారణాలను న్యాయమూర్తి ఆర్. శరత్ బాబు వెల్లడించారు.

వాలంటీర్ లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ 2023, జులై 29 న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేరుగా కోర్టుకు ఫిర్యాదు చేసారు.

కోర్టు ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్పై 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. తనపై కేసును కొట్టేయాలంటూ పవన్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం వాలంటీర్ లను మరోసారి విచారించింది. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్ లు తెలపడంతో కేసును ఎత్తివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts