telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌ ఇవే..

శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్‌రావు నేరుగా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు.

బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

*తెలంగాణ బ‌డ్జెట్ 2,56,958.51 కోట్లు
*దళిత బంధుకు 17,700 వేల కోట్లు.
*రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు
*క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు.
*29,728.44 కోట్ల క్యాపిటల్ వ్యయం.
*11 వేల 800 కుటుంబాలకు లబ్ది.
*గ్రామ పంచాయితీ లకు ప్రతినెలా 227.5 కోట్లు.
*పట్టణ ప్రగతికి 1394 కోట్లు.
*మన ఊరు , మన బడి కోసం 3497 కోట్లు.9123 పాఠశాలలు.
*వెయ్యి కోట్లతో 2.5 లక్షల ఆయిల్ ఫామ్ సాగుకు కేటాయింపు.
*24254 కోట్లు వ్యవసాయ శాఖకు.
*ఇరిగేషన్ కు 22675 కోట్లు
*హరిత హారానికి 932 కోట్లు
*ఆసరా ఫించన్ల కోసం 11728 కోట్లు.
*కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ లకు 2750 కోట్లు.
*సొంత జగ ఉన్న వాళ్లకు ఇళ్ళు కట్టుకోవడానికి మూడు లక్షలు.
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12 వేల కోట్లు.
*గిరిజన సంక్షేమం కోసం 12, 565 కోట్లు.
*బీసీ సంక్షేమం కోసం 5698 కోట్లు.
*బ్రాహ్మణ సంక్షేమం కోసం 117 కోట్లు.
*ఆర్ అండ్ బి కోసం 1,542 కోట్లు.

*పోలీస్ శాఖకు 9315 కోట్లు.

Related posts