వెస్టిండీస్ తో ఫ్లోరిడాలో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విశేషంగా రాణిస్తున్నారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ విలవిల్లాడుతోంది. కేవలం 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ 2 వికెట్లతో విండీస్ ను హడలెత్తించగా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తో
విండీస్ పనిబట్టారు.
విండీస్ జట్టులో నికోలాస్ పూరన్ ఒక్కడే 20 పరుగులు చేయగా, ఓపెనర్లు జాన్ కాంప్ బెల్, ఎవిన్ లూయిస్ సహా, షిమ్రోన్ హెట్మెయర్ కూడా డకౌట్ గా వెనుదిరిగారు. ప్రస్తుతం విండీస్ స్కోరు 7 ఓవర్లలో 5 వికెట్లకు 33 పరుగులు. ప్రస్తుతం కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వైట్, కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నారు.
రాచరిక పాలనలో తెలంగాణ బందీ: రేవంత్రెడ్డి