రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కేంద్రకేబినెట్ సమావేశమనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ భేటీలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతులు, ఎంఎస్‌ఎంఈల విషయమై కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 6 కోట్లకుపైగా ఎంఎస్‌ఎంఈలున్నాయని. ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మరింత విస్తరించామని చెప్పారు.
దేశప్రగతిలో ఎంఎస్‌ఎంఈలు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉందని జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగిందని తెలిపారు.