telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా … ఏకగ్రీవంగా మోడీ.. 30నే ..

modi oath also on 30th

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీని బీజేపీ, ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే బలపరిచారు. లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ ఎన్నికైనట్టు అమిత్‌షా ప్రకటించారు.

ఆ వెనువెంటనే ప్రధాని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ అశీస్సులు తీసుకున్నారు. మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సైతం ఈ సమావేశంలో పాల్గొని మోదీకి అభినందలు తెలిపారు. బీజేపీ, ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగానే మోదీ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ…కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన లాంఛనంగా ఎన్నికల కావాల్సి ఉండటంతో అదికూడా సజావుగా ముగియడంతో ఇక ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరడమే తదుపరి ప్రక్రియ అవుతుంది. ఇందుకోసం ఇవాళ సాయంత్రం 8 గంటలకు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలుసుకోనున్నారు. ఈనెల 30న మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Related posts