telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ నేత బుద్దా వెంక‌న్న బెయిల్‌పై విడుదల..

టీడీపీ నేత బుద్దా వెంక‌న్న బెయిల్‌పై విడుదలయ్యారు. మంత్రి కొడాలి నాని, డీజీపై  అనుచిత‌ వ్యాఖ్య‌లు చేశార‌న్న వైసీపీ నేత‌ల ఫిర్యాదుతో టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో సుమారు 6 గంట‌ల పాటు విచారించిన పోలీసులు బుద్దా వెంక‌న్న‌ను అర్థ‌రాత్రి 11గంట‌ల స‌మ‌యంలో విడుద‌ల చేశారు.

TDP leader Buddha held for levelling allegations against DGP

పోలీసులు ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2), రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని వ్యాఖ్యలు, పోలీసులు విచారణ పై మంగ‌ళ‌వారం అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. పోలీసులు తనను అడిగిన విషయాల గురించి.. తనపై కొడాలి చేసిన వ్యాఖ్యల గురించి మొత్తం వివరిస్తానని తెలిపారు.

అంతేకాదు..కొడాలి నాని పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నేనింకా క‌ట్టుబ‌డే ఉన్నాన‌ని అంటున్నారు. బుద్దా వెంక‌న్న‌ 6 గంట‌లు పాటు ఏం చేసారు..?  పోలీసులు ప్ర‌శించారా? బెదిరించారా అనేది పోలీసులు, బుద్ధ వెంక‌న్న చెబితే కానీ తెలియ‌దు. అయితే ఈరోజు  బుద్ధ వెంక‌న్న ఏం చెప్ప‌బోతున్నార‌నేది ఇంకా తెలియాల్సి ఉంది..

Related posts