ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ జగన్ కు ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానమని విమర్శించారు. ఏ మతంపైనా జగన్ కు విశ్వాసం లేదని దుయ్యబట్టారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని మండిపడ్డారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగులబెడుతున్నారని తెలిపారు. సీఎం ఏ మతస్థుడైనా కావొచ్చు, కానీ అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు.
రాష్ట్రంలోని అన్ని ప్రార్థన మందిరాలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని స్పష్టం చేశారు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీపై కక్షసాధింపు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీ ఎంపీలకు దృష్టిలేదని విమర్శించారు.